తిరుపతి: పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెదేపా నేత ప్రభాకర్ అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ మూడో ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తెదేపా నేత ప్రభాకర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో తప్పనిసరిగా తెదేపా విజయం సాధిస్తుందని అశాభావం వ్యక్తం చేశారు. తెదేపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికే అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. మరికొద్ది సేపట్లో సమావేశ ప్రాంగణానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు.




