పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
విజయవాడ,అక్టోబర్20(జనంసాక్షి): కార్తీక మాసం సందర్భంగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులలు బయలుదేరాయి. ప్రతిరోజు భక్తులను తీసుకుని పంచారామాలను దర్శనం చేయించి సాయంత్రానికి మళ్లీ తీసుకుని వచ్చేలా ఏర్పాటు చేశారు. ఒక్క రోజులోనే పంచారామాలైన అమరారామం (అమరావతి), సోమారామం (భీమవరం), క్షీరారామం (పాలకొల్లు), భీమారామం (ద్రాక్షారామం), కుమారారామం(సామర్లకోట)లను దర్శించుకునేలా టూర్ మొదలయ్యింది. పౌర్ణమి వరకు ఈ ప్రత్యేక బస్సు యాత్రలను ఏర్పాటు చేశారు. కార్తీకమాసంలో ప్రతి ఆది, సోమవారాల్లో విజయవాడ నుంచి ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరతాయని అధికారులు తెలిపారు.