హైదరాబాద్: మార్కెట్‌లో పండ్లు కొనాలంటే భయంగా ఉందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది.తెలుగు రాష్ట్రాల్లో రసాయనాలతో పండ్లను కృత్రిమంగా మాగబెట్టడంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇథిలిన్‌తో కాయలను మాగబెట్టే కేంద్రాలను నిర్ణీత కాలంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సూచించింది. దీనిపై స్పందించిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టు సూచనలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరణ ఇచ్చాయి.




