Tuesday, 3 November 2026

పనిమనిషిని కాపాడబోయి…

కృష్ణా : ప్రమాదంలో చిక్కుకున్న పనిమనిషిని కాపాడబోయి ఇంటి యజమాని మృతిచెందిన సంఘటన తీవ్రంగా కలిచివేసింది. కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో ఆదివారం ఉదయం ఓ ఇంట్లో పనిమనిషి బట్టలు ఉతికింది. అనంతరం డాబాపైన ఆరేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగెలు తగిలి కరెంటు షాక్‌కు గురైంది. ఇది గమనించిన ఇంటి యజమాని పనిమనిషిని కాపాడే ప్రయత్నం చేయగా…. అతనికి కూడా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అటు పనిషి, ఇటు ఇంటి యజమాని ఇద్దరూ మృతిచెందారు. ఈ ఘటన స్థానికులకు తీవ్రంగా కలిచివేసింది. వారి మృతదేహాలను చూసిన పలువురు కంటతడి పెట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *