Monday, 2 November 2026

పని ప్రారంభించిన కెకె కమిటీ

05-oct-07
– 7వతేదీలోగా నివేదిక

హైదరాబాద్‌,అక్టోబర్‌ 3(జనంసాక్షి):కొత్తగా ఏర్పాటు కానున్న మరో నాలుగు జిల్లాలపై ఎంపి కె. కేశవరావు నేతృత్వంలో కమిటీ ఏర్పడింది. మూడురోజుల్లో ఈ కమిటీ చర్చించి తుది నివేదిక ఇవ్వాలని సిఎం కెసిఆర్‌ ఆదేశించారు. ఇందులో డిప్యూటి సిఎం మహ్మూద్‌ అలీ సీనియర్‌ సభ్యుడిగా ఉంటారు.  ముసాయిదా నోటిఫికేషన్లో ప్రకటించిన 17 జిల్లాలు కాకుండా మరో నాలుగు ప్రాంతాల నుంచి వచ్చిన జిల్లా ఏర్పాటు డిమాండ్లను పరిశీలించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఉన్నతస్థాయి కమిటిని ఏర్పాటు చేశారు. ఎంపీ కె.కేశవరావు నాయకత్వంలోని ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు జగదీష్‌ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న సభ్యులుగా ఉంటారు. ముసాయిదా నోటిఫికేషన్లో 17 కొత్త జిల్లాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. జనగామ, సిరిసిల్ల, గద్వాల, అసిఫాబాద్‌ జిల్లాల ఏర్పాటు కోసం ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ డిమాండ్లు పరిశీలించాల్సిందిగా ప్రభుత్వం హైపవర్‌ కమిటీని కోరింది. ప్రజల డిమాండు మేరకు ఈ నాలుగు జిల్లాలు ఏర్పాటు అంశాలపై కమిటీ అధ్యయనం జరిపి ఈ నెల7వ తేదీ మధ్యాహ్నంలోగా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కొత్త జిల్లాల పరిశీలనకు అత్యవసర సమావేశాలు నిర్వహించుకుని వేగంగా పక్రియను ముగించాలని హైపవర్‌ కమిటీని ముఖ్యమంత్రి కోరారు.  గతంలో ప్రకటించిన జిల్లాలకు తోడుగా మరో నాలుగు జిల్లాలకు ఆమోద ముద్ర పడింది. దీంతో తెలంగాణలో మొత్తం 31 జిల్లాలు ఏర్పడనున్నాయి. వరంగల్‌లో 5, కరీంనగర్‌లో 4, మహబూబ్‌నగర్‌లో 4, మెదక్‌ లో 3, రంగారెడ్డిలో 3,  నల్లగొండలో 3, ఆదిలాబాద్‌ లో 4 నిజామాబాద్‌లో 2,  ఖమ్మంలో 2 జిల్లాల ఏర్పాటుకు ఓకే చెప్పారు. దీంతో రాష్ట్రంలో  హైదరాబాద్‌ తో కలిపి మొత్తం 31 జిల్లాలు  కానున్నాయి. కొత్తగూడెం జిల్లాకు భద్రాది  పేరు పెట్టాలని నిర్ణయించారు. మరోవైపు సిరిసిల్ల కేంద్రంగా ఏర్పడే జిల్లాకు రాజన్న పేరు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నెల ఒకటో తేదీన రివ్యూచేసిన చీఫ్‌ సెక్రటరీ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మొదటి రోజు ఏమేం పనులు చేయాలో  ఈ  ఉత్తర్వుల్లో  పేర్కొన్నారు. కొత్త జిల్లా, మండల కార్యాలయాల ప్రారంభోత్సవాన్ని అన్ని డిపార్ట్‌ మెంట్‌ లు చేయాలని ఆర్డర్స్‌ ఇచ్చారు. అలాగే కొత్త జిల్లా వెబ్‌ సైట్‌ లు, ఫేస్‌ బుక్‌ పేజీలు ప్రారంభించాలని చెప్పారు.నవంబర్‌ నెలకు సంబంధించి రేషన్‌ కేటాయింపు, మండలస్థాయిలో సర్టిఫికేట్ల జారీ, జిల్లా స్థాయిలో అధికారుల సమావేశం ఏర్పాటు చేయాలని  ప్రభుత్వం ఆదేశించింది. అలాగే కల్యాణలక్ష్మి డబ్బుల మంజూరు, అక్టోబర్‌ నెలకు సంబంధించి ఆసరా పెన్షన్ల కేటాయింపు వంటి పనులు చేపట్టాలని చీఫ్‌ సెక్రటరీ రాజీశ్‌ శర్మ ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 11న ఉదయం పదిన్నర లోపు అధికారులు, ఉద్యోగులు కార్యాలయాల్లో హాజరుకావాలన్నారు. పని విభజన కూడా మొదటి రోజే పూర్తి కావాలన్నారు.

ఆ నాలుగు జిల్లాలపై హైపవర్‌ కమిటీ చర్చలు

నాలుగు జిల్లాలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ఈ నెల 7న సిఎం కెసిఆర్‌కు నివేదిక సమర్పిస్తామని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు. అన్ని అంశాలను చర్చిస్తామని అన్నారు. 17 జిల్లాలు తొలుత ప్రకటించిన ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌ మేరకు మరో నాలుగు జిల్లాలు గద్వాల, జనగామ, సిరిసిల్ల, ఆసిఫాబాద్‌లను ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు. పాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌ లో ప్రకటించిన 17 కొత్త జిల్లాలతో పాటు మరో నాలుగు జిల్లాలను పరిశీలిస్తోంది ప్రభుత్వం. పార్టీ నేతల ప్రతిపాదన  మేరకు జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్‌ జిల్లాల  ఏర్పాటు కోసం హైపవర్‌  కమిటీని నియమించింది సర్కార్‌. రాజ్యసభ ఎంపీ కేశవరావు నేతృత్వంలోని  కమిటీలో డిప్యూటీ  సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు జగదీష్‌ రెడ్డి, పోచారం  శ్రీనివాస్‌ రెడ్డి, జోగు రామన్నలు  సభ్యులుగా నియమించింది. నాలుగు జిల్లాలు  ఏర్పాటు చేయవచ్చా? ఏయే మండలాలను  ఈ జిల్లాల్లో చేర్చాలి  వంటి అంశాలను పరిశీలించనున్న కమిటీ.. ఈ నెల 7న  మధ్యాహ్నం కొత్త జిల్లాలపై  సీఎం కేసీఆర్‌ కు నివేదిక సమర్పించనుంది. ఈ మేరకు తొలి సమావేశం తరవాత మంత్రి మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *