పన్ను వసూలు పరిధిలోకి ఆన్‌లైన్ వ్యాపారం
-ఎగవేతదారుల సమచారమిస్తే నగదు బహుమతి
-మంత్రి తలసాని
హైదరాబాద్, ఏప్రిల్ 9 (జనంసాక్షి):
పన్ను ఎగవేతదారులను ఎట్టి పరిస్తితుల్లోనూ వదలబోమని తెలంగాణ వాణిజ్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రకటించారు. ఆన్ లైన్ బుకింగ్ తో సరైన సమాచారం రావడం లేదని పన్ను పరిధిలోకి ఆన్‌లైన్ వ్యాపారాన్ని తెచ్చేందుకు దీనికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందిస్తామని అన్నారు. పెండింగ్ కేసులను మానిటరింగ్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. బలవంతంగా పన్నులురుద్దడం లేదా వసూలు చేయడం చేయబోమన్నారు. అయితే పన్ను ఎగవేతదారులను మాత్రం ఉపేక్షించమన్నారు. ఎగవేతదారుల సమాచారం ఇస్తే వసూలు చేసే మొత్తంలో కొంత లేదా రూ. 50 వేల వరకు ప్రోత్సాహక బహుమతి ఇస్తామని సినిమా ఆఫర్ ప్రకటించారు. సచివాలయంలో మంత్రి విూడియాతో మాట్లాడుతూ…ఇక సినిమా థియేటర్లలో టికెట్ల అమ్మకంపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. థియేటర్లు ఫలు/- అవుతున్నా 30 నుంచి 40 శాతం సీట్లు నిండడం లేదని చెబుఉతన్నారని అన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం రావడం లేదు. ఇకపై టికెట్ల వివరాలు సేకరించి, పన్ను వసూలు చేస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్ లో వాణిజ్య శాఖను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. తక్కువ ఆదాయం రావడానికి పెట్రోల్, ఢీజిల్ ధరలే కారణమన్నారు. ఆన్‌లైన్ వ్యాపారాల ద్వారా రాష్టాన్రికి పూర్తి పన్ను రావడం లేదని, దీని నివారణకు ప్రత్యేక చట్ట సవరణ చేసే యోచన ఉందని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ¬టళ్ల అమ్మకాల నివరాలు ప్రత్యేక సాప్ట్‌వేర్ ద్వారా సెంట్రల్ మానిటరింగ్ విభాగానికి చేరేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆసుపత్రుల విలాస పన్ను శాతాన్ని ఏకీకృతం చేసి రాబడి పెంచుతామన్నారు. సినిమాహాళ్లలో టికెట్ల అమ్మకాలపై పూర్తి సమాచారం రావడం లేదు… ప్రత్యేక సాప్ట్‌వేర్ ద్వారా పూర్తి వివరాలు సేకరించి పన్నురాబడి పెంచుతామన్నారు. నగరంలో కొన్ని బంగారు దుకాణాలు కనీస పన్ను కూడా చెల్లించడంలేదన్నారు. వస్త్ర వ్యాపారులకు ఎలాంటి వ్యాట్ లేదని స్పష్టం చేశారు.
కొత్త పన్నులు లేకుండాలనే ఆదాయం పెంచుతామని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణలో జీరో వ్యాపారాన్ని కట్టడి చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రులు, ¬టళ్ల నుంచి పన్ను సక్రమంగా వసూలు కావడం లేదన్నారు. బంగారం షాపుల్లో ఆడిట్ చేయిస్తామని మంత్రి చెప్పారు. పాన్ మసాలాలు నిషేధించినా జరిమానా వేసే అధికారం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచే యోచన లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.