Wednesday, 4 November 2026

పరారీలో ఎక్సైజ్‌ సీఐ

గుంటూరు : ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నాయనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు తెనాలి ఎక్సైజ్‌ సీఐ రవీంద్రనాథ్‌ నివాసంలో సోదాలు చేపట్టారు. గుంటూరు, తెనాలి, చిలకలూరి పేటతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉన్న ఆయన బంధువుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేశారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న రవీంద్రనాథ్‌ ఏసీబీ సోదాల సమయంలో కార్యాలయంలో లేరు. ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆదాయానకి మించి కోటి రూపాయల వరకూ సీఐకి ఆస్తులు ఉన్నట్లు అధికారులు పలు పత్రాలను పరిశీలించి ప్రథమిక అంచనాకు వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *