Tuesday, 3 November 2026

పవన్‌ ట్వీట్లపై స్పందించవద్దు: టిడిపి

అమరావతి,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్‌ ట్వీట్లపై ఎవరు స్పందించొద్దని టిడిపి అధిష్టానం ఆదేశించింది. పవన్‌ ట్వీట్లపై స్పందిస్తే దీక్ష పక్కదారి పడుతుందని టిడిపి భావిస్తోంది. శ్రీరెడ్డి ఎపిసోడ్‌కు రాజకీయాలను ఆపాదించడమే అతిపెద్ద రాజకీయమని టిడిపి అభిప్రాయపడుతోంది. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు దీక్ష సమయంలో ఈ తరహా రాజకీయానికి తెరలేపడంతో కుట్రలో భాగమేనని టిడిపి భావిస్తోంది.