కర్నూలు,అక్టోబర్30(జనంసాక్షి): పగిడ్యాల మండలంలోని అన్ని గ్రామాల్లో పశుగణన వేగవంతం చేయాలని పశువైద్యాధికారి సాయినాథ్ రెడ్డి సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల పరిధిలోని లక్ష్మాపురం, ప్రాతకోట గ్రామాల్లో చేస్తున్న పశుగణన సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి వెళ్లి పశువుల జాబితాను తయారు చేసి కుటుంబ యజమాని ఆధార్ కార్డు ద్వారా ఆన్‌లైన్ చేయాలని సూచించారు. సిబ్బందికి సమాచారం ఇచ్చి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది వెంకట రమణ, నాగ సులోచన తదితరులు పాల్గొన్నారు.




