దేవరపల్లి : పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లిలో ఈరోజు ఉదయం దారుణం జరిగింది. పోచమ్మ (30)పై ఆమె భర్త రవి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అడ్డువచ్చిన అత్త కళ్లేపల్లి లక్ష్మి (45)పై తీవ్రంగా దాడి చేశారు. ఘటనలో లక్ష్మి అక్కడికక్కడే మృతిచెందగా, కుటుంబ కలహాలే హత్యలకు కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




