Monday, 2 November 2026

పశ్చిమలో 1.1 మి.మీ వర్షపాతం నమోదు

ఏలూరు, జూలై 28 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 24గంటల్లో 1.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళికా శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ ఒక శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అత్యధికంగా తాళ్లపూడి మండలంలో 9.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. కాగా బుట్టాయిగూడెంలో 8.8, పోలవరంలో 7.6, ద్వారకాతిరుమలలో 5.4, నల్లజర్లలో 1.2, నిడదవోలులో 0.6, తాడేపల్లిగూడెంలో 0.8, భీమడోలులో 1.2, పెదవేగిలో 5.2, దెందులూరులో 3.6, పెంటపాడులో 1, తణుకులో 1.2, ఉండిలో 1.4, అకివీడులో 3.2, వీరవాసరంలో 1.4, మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదు అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *