Tuesday, 3 November 2026

పసికందు మృతిపై అనుమానాలు


rie3sv0yనేరేడ్‌మెట్‌ (హైదరాబాద్‌): మల్కాజ్‌గిరి పరిధిలోని నేరేడ్‌మెట్‌ రామకృష్ణాపురంలో పసికందు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొలుసు దొంగల దాడిలో గాయపడి చిన్నారి మృతిచెందాడన్న తల్లి వాదనను పోలీసులు కొట్టిపారేస్తున్నారు.
పూర్ణిమ చెబుతున్నదేమిటంటే…
నేరేడ్‌మెట్‌ రామకృష్ణాపురానికి చెందిన పూర్ణిమ అనే మహిళ మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో తన కుమారుడి(25 రోజుల పసికందు)ని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. కొద్ది దూరం రాగానే ఎదురుగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గొలుసు దొంగలు పూర్ణిమపై స్ప్రే చల్లి మెడలో ఉన్న బంగారు గొలుసు తెంపారు. పూర్ణిమ ప్రతిఘటించడంతో పెనుగులాట జరిగింది. దొంగలు దాడిచేసి గొలుసు లాక్కెళ్లారు. ఈ ఘటనలో పూర్ణిమ చంకలో ఉన్న పసికందు గొంతుకు తీవ్రగాయామైంది. ఘటన నుంచి తేరుకున్న పూర్ణిమ భర్త శ్రీధర్‌రాజుతో కలిసి పసికందును తార్నాకలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పసికందు మృతి చెందాడు.

తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్న పోలీసులు
పసికందు మృతిపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పసికందు తల్లి పూర్ణిమ చెప్పిన దానిపై పోలీసులు అనుమానించి ఆమె ఇంటిని తనిఖీ చేయగా రక్తపు మరకలున్న దుస్తులు కనిపించాయి. దీంతో దంపతులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *