Tuesday, 3 November 2026

పాంపోర్‌లో ముగిసిన ఆపరేషన్‌

C
– ఇద్దరు మిలిటెంట్ల కాల్చివేత

శ్రీనగర్‌,ఫిబ్రవరి 22(జనంసాక్షి): జమ్ముకాశ్మీర్‌ పాంపోర్‌లోని ఈడీఐ భవనంలోకి చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం కాల్చి చంపింది. దీంతో జమ్ముకశ్మీర్‌లోని పాంపోర్‌లో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య మూడు రోజులుగా కొనసాగుతున్న ఎదురుకాల్పులు ముగిశాయి. శ్రీనగర్‌-జమ్ము జాతీయ రహదారికి సవిూపంలో ప్రభుత్వ భవనంలోకి చొరబడిన మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. ఎదురుకాల్పుల్లో మొత్తం ఐదుగురు సైనికులు, ఒక పౌరుడు మృతి చెందారు. ఈ ఘటన వెనుక లష్కరే తొయిబా హస్తం ఉన్నట్లు సీఆర్పీఎఫ్‌ డీజీ వెల్లడించారు.

ఉగ్రవాదులతో కాల్పుల్లో ఆదివారం ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు, ఓ జవాను మరణించిన సంగతి తెలిసిందే. భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమవ్వగా.. సోమవారం ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమయ్యాయని.. మరొకరి మృతదేహం కోసం గాలిస్తున్నట్లు భద్రతాదళాలు తెలిపాయి. మొత్తానికి రెండు రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో ప్రస్తుతానికి కాల్పులు ఆగిపోయాయి. ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపాక ప్రస్తుతం గాలింపు జరుపుతున్నారు. సైన్యం నుంచి మరణాలు సంభవించద్దనే ఉద్దేశంతోటే తొందరపాటు లేకుండా ఆపరేషన్‌ చేపట్టామని సైన్యాధికారులు తెలిపారు. తొలుత సిఆర్‌పిఎఫ్‌ కాన్వాయ్‌పై కాల్పులు జరిపాక ఉగ్రవాదులు ఈడిఐ భవనంలోకి చొరబడ్డారు. సైన్యం అతి కష్టం విూద భవనంలో చిక్కుకున్నవారిని విడిపించగలిగింది. ఈ ఎన్‌కౌటర్‌లో ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు, ఒక జవాన్‌, ఇద్దరు పారామిలిటరీ సిబ్బంది, ఒక పౌరుడు చనిపోయారు.

జమ్ముకశ్మీర్‌లోని పాంపోర్‌లో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్‌-జమ్ము జాతీయ రహదారికి సవిూపంలో ప్రభుత్వ భవనంలోకి చొరబడిన ఉగ్రవాదులను హతమార్చేందుకు ఆపరేషన్‌ మూడో రోజు కొనసాగింది. ఉగ్రవాదుల ఏరివేతకు కాల పరిమితి ఏవిూ లేదని.. తాము తొందరపడడం లేదని, భద్రతా సిబ్బంది ప్రాణాలు పోకుండా జాగ్రత్తపడుతూ ఉగ్రవాదులను హతమార్చడం తమ లక్ష్యం అని లెఫ్టినెంట్‌ జనరల్‌ సతీష్‌ దువా తెలిపారు.ఉగ్రవాదులు శ్రీనగర్‌లోని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఈడీఐ) భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈడీఐ క్యాంపస్‌ చాలా పెద్దదని.. అందులో రెండు భవనాలు క్లియర్‌ చేశామని తెలిపారు. మూడో భవనంలో ఉగ్రవాదులు ఉన్నారు. నాలుగు అంతస్థుల భవనంలో 40 నుంచి 50 గదులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఒక్కో అంతస్థులోకి వెళ్లి క్లియర్‌ చేయడానికి ప్రత్యేక బృందాలు అవసరమని చెప్పారు. ఇందులో భాగంగా సోమవారం  కూడా ఆపరేషన్‌ కొనసాచి చివరకు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు.

పాంపోర్‌ ఉగ్రదాడిలో రూ.220 కోట్లు గల్లంతు!?

జమ్ముకశ్మీర్‌ లోని పాంపోర్‌ లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు ముగిశాయి. శనివారం నుంచి కొనసాగిన ఈ ఆపరేషన్‌ లో ఐదుగురు సైనికులు, ఒక పౌరుడు, ముగ్గురు ఉగ్రవాదులు కలిపి మొత్తం 9 మంది మరణించారు. ఇప్పటివరకు ఇద్దరు ముష్కరుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు మరొకడి శవం కోసం గాలిస్తున్నాయి. కాగా ఉగ్రదాడితో జేకేఈడీఐ సంస్థకు భారీగా ఆస్తినష్టం సంభవించడమేకాక కంప్యూటర్‌ డేటా ధ్వంసం కావడంతో రూ.220 కోట్లు గల్లంతయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సంస్థనే ఉగ్రవాదులు టార్గెట్‌ చేసుకోవడం వెనుక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం 2004లో జమ్ముకశ్మీర్‌ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ డెవలప్‌ మెంట్‌ ఇన్‌ స్టిట్యూట్‌(జేకేఈడీఐ)ను నెలకొల్పింది. జమ్ము- శ్రీనగర్‌ జాతీయ రహదారికి అతి సవిూపంగా పాంపోర్‌ లో మూడున్నర ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ సంస్థ.. ఇప్పటివరకు 13వేల మందికిపైగా యువ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చింది. మరో 5వేల మంది ఔత్సాహికులకు లోన్ల రూపంలో కోట్లాది రూపాయల ఆర్థిక సహాయం చేసింది. అయితే నిత్యం వందలమంది వచ్చిపోయే ఈ సంస్థపై దాడి జరగవచ్చనే అనుమానం గతంలోనే వ్యక్తమైంది. ఆ క్రమంలోనే జేకేఈడీఐకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ ముందుకొచ్చింది. కానీ సంస్థ నిర్వాహకులు, ప్రభుత్వం మాత్రం పోలీసుల హెచ్చరికలను తేలికగా తీసుకుంన్నారు.  శనివారం నాటి ఘటనలో మొదట జాతీయ రహదారి విూద సీఆర్పీఎఫ్‌ జవాన్లపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అక్కడి నుంచి  జేకేఈడీఐ ప్రాంగణంలోపలికి సులువుగా చొచ్చుకుపోయారు. అడ్మినిస్ట్రేటివ్‌ భవంతి నాలుగో అంతస్తులో దాక్కున్నారు. సరిగ్గా అదే అంతస్తులో జేకేఈడీఐ డేటాబేస్‌ సెంటర్‌ ఉంది. దాదాపు మూడు రోజులపాటు ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కంప్యూటర్లతోపాటు డేటా మొత్తం ధ్వంసమైందని, బ్యాకప్‌ సౌకర్యం కూడా లేకపోవడంతో పారిశ్రామికవేత్తలకు రుణంగా ఇచ్చిన రూ.220 కోట్లకు సంబంధించిన వివరాలు గల్లంతయ్యాయని జేకేఈడీఐ ఉద్యోగి ఒకరు తెలిపారు. భద్రతా బలగాలు, పోలీసులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘భద్రత విషయంలో జేకేఈడీఐ తీరు గర్హనీయం. పొరపాటున ఎప్పుడైనా మా పోలీస్‌ జీపులు ఆ ప్రాంగణంలోకో లేక ప్రహారీ బయటో ఆపితే అధికారులు ఊరుకునేవారు కాదు. ‘అరే.. మేం పోలీసులం’ అని చెప్పినా వినిపించుకునేవారుకాదు. మమ్మల్ని కాదని ప్రైవేట్‌ సెక్యూరిటీ సంస్థకు రక్షణ బాధ్యతలు అప్పగించారు. ఉగ్రవాదులు ఈ సంస్థను టార్గెట్‌ చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణమే’ అని పోలీస్‌ అధికారి ఒకరు కుండబద్దలు కొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *