వరంగల్‌ మేయర్‌ అభ్యర్థిగా వరదారెడ్డికి గ్రీన్‌సిగ్నల్‌!

వరంగల్‌: వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ వాడీవేడీగా చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా కార్పొరేషన్‌ ఎన్నికలపై సోమవారం టీఆర్‌ఎస్‌ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జిల్లా ఎమ్మెల్యేలు, పలువురి నేతలు హాజరయ్యారు.

కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో కార్పొరేటర్ల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. అయితే గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ అభ్యర్థిగా యనగందుల వరదారెడ్డికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.