
– బచాఖాన్ వర్సిటీపై విచక్షణ రహితంగా కాల్పులు
– 60 మందికిపైగా చనిపోయినట్లు సమాచారం
లా¬ర్‌లో,జనవరి20(జనంసాక్షి):పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. వాయువ్య ప్రాంతమైన చర్సడా నగరంలోని బచాఖాన్ యూనివర్సిటీపై బుధవారం ఉదయం ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. సాయుధులైన ఉగ్రవాదులు యూనివర్సిటీ క్యాంపస్‌లోకి చొరబడి పేలుళ్లు, కాల్పులతో విరుచుకుపడ్డారు. గతేడాది ఓ సైనిక స్కూలుపై దాడి చేసి వందలాది మంది చిన్నారును పొట్టన పెట్టుకున్న విషయాన్ని మరచిపోకముందే ఈ దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. పెషావర్ సైనిక పాఠశాలలో 144 మంది చిన్నారులను పొట్టన పెట్టుకున్న ముష్కరులు మరోసారి విద్యార్థులనే టార్గెట్ చేసుకున్నారు. పాకిస్థాన్‌లోని బచాఖాన్ యూనివర్సిటీలోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదులు విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. యూనివర్సిటీ వెనుక భాగం నుంచి ఉదయం 9.30 గంటలకు లోపలికి వెళ్లిన ఉగ్రవాదులు ఇప్పటికీ ఏడు పేలుళ్లు జరిపారు. భారత్‌లోని పఠాన్‌కోఠ్ తరహాలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఉదయం నుంచి యూనివర్సిటీలోని విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. యూనివర్సిటీలో జరుగుతున్న ఓ ఈవెంట్ సందర్భంగా ప్రస్తుతం అక్కడ 3వేల మంది విద్యార్థులు, 600 మంది అతిథులు ఉన్నారు. ముష్కరుల కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, 50మందికి గాయాలైనట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ముష్కరుల దాడిలో దాదాపు 70మంది వరకు మృతిచెందినట్లు పాక్ విూడియా వెల్లడించింది. ఖైబర్ పక్తున్ ఖ్వా ప్రావిన్స్ లో ఉన్న ఈ బచా ఖాన్ యూనివర్సిటీలోకి 12 మంది సాయుధ ఉగ్రవాదులు చొరబడి. తరగతులు, హాస్టళ్లలోని విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణారహితంగా కాల్పులు, బాంబు పేలుళ్లకు తెగబడ్డారని వార్తా చానళ్లు వెల్లడించాయి. 25 మంది మృతి చెందారు. 60 మందిపైగా గాయపడినట్టు సమాచారం. వర్సిటీలో మొత్తంలో 600 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబాన్ ప్రకటించుకుంది. విద్యార్థులు తల్లిదండ్రులు, వర్సిటీ సిబ్బంది కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరంతా వర్సిటీ వెలుపల గుమిగూడారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. వీరికి సాయంగా హెలికాప్టర్లను రప్పించారు. పొగమంచు దట్టంగా అలముకోవడంతో వర్సిటీలోకి ఎంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారనేది తెలియడం లేదు. కాగా, నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. పెషావర్ సైనిక స్కూల్ పై తాలిబాన్ ఉగ్రవాదులు 134 విద్యార్థులను కాల్చివేసిన సంఘటన మర్చిపోకముందే విద్యాలయంపై మరో దాడి జరగడం పట్ల భయాందోళన వ్యక్తమవుతోంది. ఉదయం దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో యూనివర్సిటీలోకి ఎంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారన్న దానిపై పోలీసులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. యూనివర్సిటీ ప్రాంగణం చుట్టూ భద్రతా సిబ్బంది భారీగా మోహరించి ఉగ్రవాదులపై ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్లు తెలుస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అతిథులను రక్షించేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు డిప్యుటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సయీద్ వజీర్ వెల్లడించారు. ఉగ్రదాడితో భయాందోళనకు గురైన విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. సైనికులు హెలికాప్టర్ల ద్వారా రక్షణ చర్యలు చేపట్టారు. ఉగ్రదాడి విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు యూనివర్సిటీ వద్దకు భారీగా చేరుకున్నారు. బచాఖాన్ యూనివర్సిటీపై దాడికి పాల్పడింది తామేనని తెహ్రిక్-ఇ-తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.




