Monday, 2 November 2026

పాక్‌ సైన్యం కాల్పులు

6

ప్రతిఘటించిన భారత జవాన్లు

నలుగురు పాకిస్థాన్‌ రేంజర్లు, ఒక బీఎస్‌ఎఫ్‌ జవాను మృతి

శ్రీనగర్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్‌ ఉల్లంఘిస్తూనే ఉంది. మళ్లీ సరిహద్దులోని సాంబా సెక్టార్‌లో పాకిస్థాన్‌ సైన్యం కాల్పులు జరిపింది. బీఎస్‌ఎఫ్‌ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్‌ కాల్పులు జరిపింది. పాక్‌ సైన్యం కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాను మృతి చెందాడు. దీనికి ప్రతిగా మన జవాన్లు కూడా స్పందించారు. తిప్పికొట్టేందుకు కాల్పులు జరిపారు. బీఎస్‌ఎఫ్‌ జవాన్ల కాల్పుల్లో నలుగురు పాక్‌ రేంజర్లు మృతిచెందారు.

బుధవారం ఉదయం సరిహద్దు ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌ జవానులు గస్తీ తిరుగుతున్న సమయంలో పాక్‌ సైనికులు ఒక్కసారిగా కాల్పులు జరుపారు. ఈ కాల్పుల్లో ఒక జవాను మృతి చెందారు. దీంతో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు తిరుగుకాల్పులు జరిపారు. హోరాహోరీగా సాగిన కాల్పుల్లో పాక్‌ రెంజర్లు నలుగురు మృతి చెందారు. కొంత సేపటికి తేరుకున్న పాక్‌ జవానులు ఆ నలుగురి మృతదేహాలు తీసుకునేందుకు కాల్పులు ఆపాల్సిందిగా తెలుపు రంగు జండాను ఊపి కోరారు. దీంతో బీఎస్‌ఎఫ్‌ జవానులు శాంతించారు. కాగా దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *