Monday, 2 November 2026

‘పీకే’పై నో అబ్జెక్షన్‌

విచారణలేదు-మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌

ముంబై,డిసెంబర్‌31(జనంసాక్షి):  అవిూర్‌ఖాన్‌ నటించిన ‘పీకే’ సినిమాపై ఎలాంటి విచారణ చేపట్టబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ స్పష్టంచేశారు. పీకే సినిమాలో ఉన్న అభ్యంతరకర అంశాలపై విచారణను చేపట్టాలని కేంద్ర ¬ంమంత్రిత్వ శాఖ ఆదేశించిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. ఈ విషయమై సీఎం ఫడ్నవిస్‌ మాట్లాడుతూ ‘పీకే సినిమాపై ఎలాంటి విచారణ లేదు. మహారాష్ట్రలో పీకే సినిమా ప్రదర్శన 5కొనసాగుతుంది. పీకే సినిమా విజయవంతంగా ప్రదర్శితమవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో భద్రతను కల్పిస్తుందని’ స్పష్టం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా పీకే సినిమాలో పలు అభ్యంతరకర సన్నివేశాలున్నాయని గత కొన్ని రోజులుగా పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే బాలీవుడ్‌ స్టార్లు అవిూర్‌ఖాన్‌, అనుష్క శర్మ నటించిన ‘పీకే’ సినిమాకు యూపీ ప్రభుత్వం వినోద పన్ను నుంచి మినహాయింపునివ్వాలని నిర్ణయించింది. ఈ విషయంపై సెన్సార్‌ బోర్డు అధికారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ ఈ సినిమా చూశారన్నారు. సినిమా చూసిన అనంతరం ఇలాంటి సినిమాలపై వినోద పన్ను ను మినహాయింపునివ్వాలని సీఎం అఖిలేష్‌ నిర్ధేశించారని అధికారి తెలిపారు. అవిూర్‌ఖాన్‌ నటించిన పీకే చిత్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సన్నివేశాలున్నాయని భజరంగ్‌దళ్‌, హిందూ యువ సేన కార్యకర్తలు కొన్ని రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *