వాటర్ గ్రిడ్ లక్ష్యం అదే
ఉన్నతస్థాయి అధికారులతో సీఎం సమీక్ష

హైదరాబాద్,డిసెంబర్31(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్తశుద్ధితో పనిచేస్తే రెండేళ్లలో జలజాలం పూర్తి చేయవచ్చని అన్నారు. భౌగోళిక పరిస్థితులు, జనాభా ఆధారంగా పనులు చేయాలన్నారు. 2, 3 నియోజకవర్గాలకు నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని… విద్యుత్, జలజాలం పనులను సమాంతరంగా చేపట్టాలన్నారు. మంచినీరు తాగకపోవడం వల్లే ఎక్కువశాతం వ్యాధులు వస్తున్నాయని, రక్షిత మంచినీరు ద్వారా ప్రజల ఆరోగ్యం రక్షించాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నీరు అందించాలన్నదే తన లక్ష్యమన్నారు. రక్షిత మంచి నీరు ద్వారానే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.చిత్తశుద్ధితో పని చేస్తే రెండేళ్లలో జలజాలం పూర్తి చేయవచ్చు అని సూచించారు. ఎక్కడికక్కడ వాటర్‌గ్రిడ్ పనులు పూర్తి చేయాలన్నారు. భౌగోళిక పరిస్థితులు, జనాభా ఆధారంగా పనులు చేయాలని తెలిపారు. విద్యుత్, వాటర్‌గ్రిడ్ పనులను సమాంతరంగా చేపట్టాలని సూచించారు. మంచినీరు తాగకపోవడం వల్లే ఎక్కువ శాతం వ్యాధులు వస్తున్నాయని చెప్పారు. ఇదిలావుంటే విద్యుత్ పనులకు కూడా అంతే ప్‌ఆరధాన్యం ఇస్తున్నారు. తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు అయ్యే వ్యయానకి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ రంగమే పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది తన అభిమతమని సిఎం చెప్పారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి జెన్‌కో చేపట్టిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన బిహెచ్‌ఇఎల్‌కు మొదటి విడత నిధులు అందించారు. రూ.3,810 కోట్లతో కొత్తగూడెంలో 800 మెగావాట్లు,మణుగూరులో రూ.4,200 కోట్లతో 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బిహెచ్‌ఇఎల్ నిర్మిస్తున్నది. నిర్మాణ వ్యయానికి సంబంధించిన మొదటి విడత రూ.350 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి బిహెచ్‌ఇఎల్ సిఎండి ప్రసాదరావుకు అందించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలకే అప్పగించడం ద్వారా పారదర్శకత, ఉంటుందని తాను భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ రాష్టాన్న్రి మూడేళ్లలో కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన నేపధ్యంలో జెన్‌కో,భేల్‌పై చాలా బాధ్యత వుంన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, మణుగూరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణ పురోగతిని సవిూక్షించారు. ప్లాంట్లకు సంబంధించిన డిజైన్లు, బాయిలర్లు, టర్బయిన్లు నిర్మాణ ప్రతిపాదనలు సిద్దమయ్యాయని,సివిల్ వర్క్‌శరవేగంగా పూర్తి చేయడానికి అవసరమైన నేపధ్యం సిద్దంగా ఉందని భెల్ సిఎండి ప్రసాదరావు తెలిపారు. మణుగూరులో రెండేళ్లలో, కొత్తగూడెంలో మూడెళ్లోలో ప్లాంట్లు సిద్దం అవుతాయని వివరించారు. ఈరెండు ప్లాంట్ల నిర్మాణంతో పాలు, అదిలాబాద్ జిల్లాఆ జైపూర్‌లో కూడా పనులు వేగవంతం చేయాలన్నారు. నల్గొండ జిల్లాలో కూడా 7600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్థాపనకు అవసరమయ్యే పర్యవరణ అనుమతులు త్వరలో సాధిస్తామని చెప్పారు. మంత్రులు కె.తారకరామారావు,తుమ్మల నాగేశ్వర్ రావు, జగదీష్‌రెడ్డి, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు తదితరులు ఈ




