Tuesday, 3 November 2026

పాఠశాల బస్సు బోల్తా: 40మంది విద్యార్థులకు గాయాలు

owp5bbih చిత్తూరు జిల్లాఛౌడేపల్లి మండలం కాట్పేరి బస్టాండు వద్ద శనివారం ఉదయం పుంగనూరుకు చెందిన ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40మంది విద్యార్థుల్లో 10మందికి తీవ్ర గాయాలు కాగా, 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు విద్యార్థులను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారమణి స్థానికులు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. బోయకుండ పరిసర గ్రామాల నుంచి విద్యార్థులను పుంగనూరు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *