హైదరాబాద్ పాతబస్తీలో సౌత్ జోన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మొఘల్ పురా, సుల్తాన్ షాహి, ఛత్రినాక, కృష్ణారెడ్డి నగర్ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. 80 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 220 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకు తిరుగుతున్న 10 మంది నాన్ బెయిలబుల్ వారంట్ ఉన్న ముద్దాయిలను పట్టుకున్నారు. ఒక గుడుంబా కేసు నమోదు చేశారు. రెండు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యాన్ని దాచిన వారు దొరికారు. నకిలీ స్టాంప్ వెండర్స్ పది మందిని గుర్తించారు. కీలక సూత్రధారిని అరెస్ట్ చేశామని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ప్రకటించారు. దాదాపు 20 కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. తనిఖీల్లో 500మంది సౌత్ జోన్ పోలీసులు పాల్గొన్నారు.
పాతబస్తీలో సౌత్‌జోన్ పోలీసుల కార్డన్‌సెర్చ్




