Thursday, 5 November 2026

పాముకాటుకు బాలుడు మృతి

కర్నూలు,మే9(జ‌నం సాక్షి):  పాముకాటుకు ఓ బాలుడు మృతి చెందిన ఘటన గుంతకందాల గ్రామంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబధించి వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం భార్య స్వప్న తో కలిసి శ్రీనివాసగౌడ్‌ వ్యవసాయ పనుల నిమిత్తం పొలంకు వెళ్లారు. కొడుకు జయకృష్ణ, కూతురు పల్లవి ఇంటివద్ద ఆడుకుంటుండగా జయకృష్ణ పాము కాటుకు గురయ్యాడు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.