రోజా సినిమాలకే పరిమితమైతే మంచిది
రాజకీయాల్లో జబర్దస్త్ కార్యక్రమాలు ఉండవన్న మంత్రి ఆదినారాయణ
అమరావతి,మే9(జనం సాక్షి): రాజకీయాల్లో జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు నడవవని రోజా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే రోజా చేస్తున్న అభియోగాలు సరికాదని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. ఒకవైపు సీబీఐని తప్పు పడుతున్న వైకాపా నేతలు… చంద్రబాబుపై అదే సంస్థతో విచారణ జరపాలంటూ ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు. అసలు వారు సీబీఐని విూరు నమ్ముతారా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. తండ్రి సమానమైన వ్యక్తిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని.. త్వరలో ఆయన జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. రోజా రాజకీయాలు వదిలి సినిమాలు, సీరియళ్లకు పరిమితం కావాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ రోజా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాజకీయాల్లో జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు నడవవని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రోజా రాజకీయాలు వదిలి సినిమాలు, సీరియల్స్‌కు పరిమితం కావాలని మంత్రి ఎద్దేవా చేశారు.