నగరంలో సీసీ కెమెరాలు-రాజ్‌నాథ్‌సింగ్

న్యూఢిల్లీ,డిసెంబర్29(జనంసాక్షి): బెంగళూరు నగరంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అవసరమైతే పేలుళ్ల కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తామన్నారు.బాంబు పేలుడు ఘటనపై జాతీయ భద్రతా సలహాదారు, ఐటీ చీఫ్, కేంద్ర ¬ంశాఖ కార్యదర్శితో సవిూక్ష నిర్వహించారు. అలాగే కేంద్రమంత్రులు అనంతకుమార్, సదానంద గౌడలతో కూడా రాజ్‌నాథ్ సవిూక్షించారు. బెంగళూరులోని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని కర్ణాటక ప్రభుత్వానికి రాజ్‌నాథ్ సూచించారు. మరోవైపు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఈ పేలుడు తీవ్రవాదుల దుశ్చర్యేనని అభిప్రాయపడ్డారు. బెంగళూరు పేలుడు ఘటనపై ప్రభుత్వం స్పందించి దర్యాప్తు వేగవంతం చేసింది. నిందితుల వివరాలు అందించిన వారికి రూ.10లక్షల నజరానా ప్రకటించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని చర్చి వీధిలో ఆదివారం రాత్రి జరిగిన బాంబు పేలుడులో మహిళ మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఐఈడీతో ఈపేలుడు జరిపినట్లు భావిస్తున్నారు.
మరోవైపు బాంబుపేలుడు ఘటన నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో భద్రతను పెంచాల్సిందిగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దీల్లీ పోలీసులను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అత్యంత రద్దీగా ఉండే చాందినీాక్, పహార్‌గంజ్, సరోజినినగర్ తదితర ప్రాంతాల్లో పోలీసుల భద్రతను పెంచారు. బెంగళూరు ఘటన నేపథ్యంలో కోల్‌కతా, ముంబయి, పుణె తదితర ప్రాంతాల్లో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు.




