
– టీఆర్‌ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం
హైదరాబాద్, నవంబర్ 23 (జనంసాక్షి):
26నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. సీఎం అధికార నివాసంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గట్టిగా నిలదీయాలన్నారు. హైకోర్టు విభజన, రాష్ట్రానికి చెందిన జాతీయ రహదారులు, ప్రాజెక్టులకు జాతీయ ¬దా కల్పించడం తదితర అంశాలను ఉభయ సభల్లో ప్రస్తావించాలని సీఎం సూచించారు.తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని, రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హావిూలను కూడా అమలు చేయడంలేదని సమావేశంలో చర్చించారు. దీనిని పార్లమెంటు సమావేశాల్లో నిలదీయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం భాజపా పాలిత రాష్ట్రాలకు అత్యధిక నిధులు కేటాయించడం దారుణమని, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎనలేని ప్రేమను ప్రదర్శిస్తున్నారని ఎంపిలు అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హావిూలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని ఇప్పటి వరకు మూడుసార్లు కలిశారని, నీతిఅయోగ్ సమావేశంలో రెండుసార్లు కలిశారని, పలుమార్లు కేంద్ర మంత్రులను కూడా కలిశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో సంప్రదించడంలేదని ప్రధానమంత్రి అనడం సరికాదన్నారు. హైకోర్టును విభజించాలని, తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వాలని అనేకసార్లు కోరామన్నారు. అలాగే ప్రాణహిత- చేవెళ్లకు జాతీయ¬దా, పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, ఎన్టీపీసీకి బొగ్గులింకేజీలు, గిరిజన విశ్వవిద్యాలయం, ఉద్యానవర్సిటీ, బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు, ఉద్యోగుల విభజన వంటి సమస్యలను పరిష్కారించాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా..? అని ప్రశ్నించారు. ఇటీవల కేంద్రం పట్టణ గృహ నిర్మాణ పథకాన్ని ప్రకటించిందని, తెలంగాణ ప్రభుత్వానికి రూ.179 కోట్లను కేటాయించి దీనికి సరిపడ ప్రణాళికను పంపించమని చెప్పారని.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికను పంపించిందన్నారు. అదే ఆంధప్రదేశ్‌కు రూ.250కోట్లకు సరిపడ ప్రతిపాదనలు పంపించాలని కేంద్రం సూచిస్తే.. వారు దాన్ని తుంగలోకి తొక్కి రూ.2500 కోట్ల ప్రతిపాదనలను పంపిస్తే, కేంద్రం దీన్ని పూర్తిగా ఆమోదించిందన్నారు.కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నించాల్సిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ప్రశ్నించడం, విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వారికి నిజంగా రాష్ట్ర అభివృద్ధిపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి తమతోపాటు కలిసి రావాలన్నారు.




