– అమర జవాన్లకు నేతల ఘన నివాళి
న్యూఢిల్లీ,డిసెంబర్13,(జనంసాక్షి): 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ప్రధానితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ అగ్రనేత అద్వానీ, ఇతర పార్టీ నేతలు కూడా నివాళులర్పించారు. 2001 డిసెంబర్ 13న ఉద్రవాదులు జరిపిని దాడిలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు చనిపోయారు. దాడికి పాల్పడ్డ ఐదుగురు ఉద్రవాదులను పోలీసులు కాల్చి చంపారు. ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి కూడా ఉగ్రవాద కాల్పుల్లో చనిపోయారు. పార్లమెంట్‌పై దాడి కేసులో సూత్రధారి అఫ్టల్ గురును ఉరితీశారు. ఆ రోజను ఢిల్లీ పోలీసులు, పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది ప్రాణ త్యాగం చేసి ఉగ్రవాదులను మట్టు బెట్టకపోతే నాయకులు మిగిలేవారు కాదు. ఉభయ సభలు వాయిదా పడిన సమయంయలో దాడి జరిగింది. దాడి సమయంలో నాటి ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ సహా పలువురు నాయకులు పార్లమెంట్‌లోనే ఉన్నారు.





