పిడుగుపాటు మృతుల కుటుంబాలకు పర్యామర్శ
గుంటూరు,మే19( జనం సాక్షి): గురజాల మండలం సమాధానం పేటలో పిడుగుపాటుకు మృతి చెందిన బాలురు శ్రీహరి, మనోహర్, పవన్ కుటుంబాలను టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఒక్కో కుటుంబానికి రూ. 25వేల వ్యక్తిగత సాయం అందజేశారు. ప్రభుత్వం తరపున రూ. 4లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ఎమ్మెల్యే యరపతినేని వారికి హావిూ ఇచ్చారు.