పినాకిని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
విజయవాడ,సెప్టెంబర్4(జనంసాక్షి): మరో రైలు ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. ఈ రైలు సోమవారం ఉదయం 6 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరింది. తెనాలి రైల్వేస్టేషన్ దాటిన తరవాత మ్లలెపాడు వద్ద రైలు పట్టా విరిగిన విషయాన్ని డ్రైవర్ గుర్తించి రైలును వెంటనే నిలిపివేశాడు. ఐదు బోగీలు దాటిన తరవాత ఈ విషయాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే రైల్వే అధికారులు సమాచారం అందించాడు. అధికారులు ఇంజినీరింగ్ బృందంతో అక్కడికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత రైలు బయలుదేరి వెళ్లింది. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రమాదం జర్కుండ ఆ కాపాడిన డ్రైవర్‌ను ప్రయాణికులు అభినందించారు.