నెల్లూరు : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని రెండోవ ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ -సీ 31 రాకెట్‌ను బుధవారం ఉదయం 9 గంటల 31 నిమిషాలకు ప్రయోగించారు. ప్రయోగ సమయానికి 48 గంటల ముందుగానే కౌంట్ డౌన్ ప్రారంభించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. ఇప్పటి వరకు పీఎస్ఎల్వీ సిరీస్‌లో 33 ప్రయోగాలను ప్రయోగించినట్లైంది. పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో మొదటిది అపజయంతో ప్రారంభమైనా తర్వాత ప్రయోగించిన 31 ప్రయోగాలు విజయవంతంగా కొనసాగించింది. ప్రస్తుతం పీఎస్ఎల్వీ – సీ 31 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
రేడియో, వాతావరణం, భూగర్భ పరిశోధనలు, గ్రహాల స్ధితిగతులను కనుగొనేందుకు 100కు పైగా ఉపగ్రహాలను ఇప్పటికే ఇస్రో ప్రయోగించింది. పీఎస్ఎల్వీ – సి 31 రాకెట్ ద్వారా 1425 కిలోల బరువున్న ఐఆర్ఎన్ఎస్ఎస్- 1ఇ ఉపగ్రహాన్ని రోదసీకి పంపారు. ఐఆర్ఎన్ఎస్ఎస్- 1ఇ ఉపగ్రహం ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం ఉపగ్రహాల సీరిస్‌లో ఇది ఐదోవది. ఈ ఉపగ్రహంలో రెండు రకాల సాంకేతిక పరికరాలను అమర్చి పంపుతున్నారు. నావిగేషన్ పేలోడ్స్‌లో ఎల్-5 బ్యాండ్, ఎస్ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్స్‌ను పంపుతున్నారు. దీనివల్ల నావిగేషన్ సర్వీస్ సిగ్నల్స్‌ను వేగంగా అందిస్తుంది. రేంజింగ్ పేలోడ్స్‌లో సీ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్స్, రెట్రోరిఫ్లెక్షన్ లేజర్ రేంజింగ్ అనే పరికరాలు పనిచేస్తాయి. ఈ సాంకేతిక పరికరాలన్నీ భారత్‌కు దిక్సూచి వ్యవస్థలను అందిస్తాయి. ఈ ప్రయోగంతో ఐదు ఉపగ్రహాలను పూర్తి చేసుకుని ఫిబ్రవరి, మార్చిలో మరో రెండు ఉపగ్రహ ప్రయోగాలను పూర్తి చేసే లక్ష్యంతో ఇస్త్రో శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు.
పీఎస్ఎల్వీ – సి 31 సక్సెస్…




