న్యూఢిల్లీ, డిసెంబర్ 31(జనంసాక్షి)-
దేశరాజధాని దిల్లీలో 2012 డిసెంబర్ 16న గ్యాంగ్‌రేప్‌కు గురై మృతిచెందిన ‘నిర్భయ’ తల్లిదండ్రులు బుధవారం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఈ సందర్భంగా మోదీ మహిళల భద్రత కోసం చర్యలు చేపడతామని హామీ
ఇచ్చారు. మహిళల భద్రత, సంక్షేమం కోసం నిర్భయ జ్యోతి పేరిట ట్రస్ట్ నిర్వహిస్తున్నందుకు నిర్భయ తల్లిని మోదీ అభినందించారు.
2012లో నిర్భయ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.




