కేరళ అగ్ని ప్రమాదం ఘటనలో ఏడుగురు అధికారులు.. జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రెండు రోజులుగా వారి కోసం వెతుకుతున్నారు. వారిలో ఐదుగురు అధికారులు ఈ ఉదయం కొల్లం ఎస్పీ ముందు సరెండర్ కాగా.. మరో ఇద్దరు కొద్ది సేపటి క్రితం లొంగిపోయారు. వీరిలో ఆలయ అధ్యక్షుడు, ట్రెజరర్, సెక్రటరీ ఉన్నారు. వారి నుంచి స్టేట్ మెంట్ తీసుకున్న అధికారులు.. మెజిస్ట్రేట్ ముందు హాజరపరుచనున్నారు.
పుట్టంగల్ ఘటనలో ఐదుగురి లొంగుబాటు




