పునరావాస ప్రజలకు ఇబ్బందులు రావద్దు

ఏలూరు,జూన్‌27(జ‌నం సాక్షి): పునరావాస గ్రామాల్లో మౌలికసదుపాయల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ అన్నారు. పునరావాస గ్రామాల్లో విద్యుత్‌, తాగునీరు, డ్రెయినేజీలు, కాలనీ ఇళ్ల మరమ్మతులపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్వాసితులను పునరావాస గ్రామాలకు తరలించినప్పటి నుంచి వారి సమస్యలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని అన్నారు. కాలనీలకు మరమ్మతులు చేయాలనే విషయాలపై హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పట్టించుకోవాలని సూచించారు. కాలనీల లేఅవుట్‌, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పూర్తి సమాచారం పునరావాస గ్రామాల వద్ద బోర్డులు పెట్టాలని సూచించారు. ఏ సమస్య గురించి అయినా తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై తీసుకునే చర్యలు కఠినంగాఉంటాయని గతంలోనే జెసి హెచ్చరించారు. తాగునీరు, కుండీల్లో చెత్తతొలగింపు, డ్రెయినేజీల విషయంలో జెసి ఇదివరకే సూచనలిచ్చారు. పునరావాలస గ్రామాల్లో చెత్తను డంపింగ్‌యార్డ్‌కు తరలించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి పైపుల లీకేజీ విషయంలో ఆర్‌డబ్ల్యూయస్‌ ఎఇ తీసుకున్న చర్యల గురించి పూర్తివివరాలను అడిగి తెలుసుకున్నారు. పునరావాలస కాలనీల విషయంలో బాధ్యులైన ప్రతి అధికారి వద్ద నుంచి వారుచేసిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దేవాలయాలు, అంగన్‌వాడీ భవనాలు, కమ్యూనిటీహాళ్ల భవనాలకు విద్యుత్‌ కనెక్షన్‌లు ఇచ్చిగ్రామ పంచాయతీలకు అప్పగించాలని ట్రాన్స్‌కో ఎఇని ఆదేశించారు. పునరావాస కాలనీల్లో శ్మశానవాటికల లేఅవుట్‌లు, పునరావాలస కాలనీల్లోని కుటుంబాల వివరాల బోర్డులు ఏర్పాటు చేయాని, పైడిపాక పునరావాసగ్రామ పరిధిలోని చంద్రకాలనీకి ఇచ్చిన శ్మశానస్థలం అంత్యక్రియలకు అనువుగా లేనందున పది అడుగుల ఎత్తుమేర ఆ ప్రదేశంలో మట్టిని డంప్‌చేసి ఇస్తే శ్మశానవాటికకు బాగుంటుందని తహశీల్దార్‌కు సూచించారు. అయితే ఆదేవాలు అమలుకావడం లేదని డేగా అన్నారు. ఇకపోతే వర్షాభావం, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలతో ప్రతి రైతు తీవ్రంగా నష్టపోతున్నాడని, మరోవైపు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివరించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబులు అధికారం చేపట్టి మూడేళ్లు దాటుతున్నా ప్రజా సంక్షేమ పాలన అందించడంలో విఫలం అయ్యారని విమర్శలు చేశారు. అన్నం పెట్టే రైతన్నల ఆత్మహత్యలు ఆగేలా చర్యలు తీసుకోవాలనిఅన్నారు.