ధవిళేశ్వరం: తూర్పుగోదవరి జిల్లా ధవళేశ్వరంలోని ఆంజనేయస్వామి గుడి ప్రాంతంలో పులి చర్మాలను తరలిస్తూ ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అతని వద్ద నుంచి రూ.2 లక్షల విలువైన చర్మాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీదేవి వెల్లడించారు. పిడింగొయ్యి ప్రాంతానికి చెందిన పాకా రాజు చింతపల్లి అటవీప్రాంతం నుంచి పులి చర్మాలను తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.




