Tuesday, 3 November 2026

పుష్కర స్నానానికి వెళ్తూ.. వివాహిత మృత్యువాత

తాడికొండ: కృష్ణా పుష్కర స్నానానికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదానికి గురై వివాహిత మృతిచెందిన సంఘటన సోమవారం మోతడక వద్ద జరిగింది. తాడికొండ పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి…తెనాలికి చెందిన ఆలకుంట నాగలక్ష్మి (40) తన ఇద్దరు కుమారులతో గుంటూరు నగరంపాలెంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. బంధువులతో కలిసి ఆమె గుంటూరు నుంచి అమరావతికి ఆటోలో బయలు దేరింది. ఆటో మోతడక కోళ్ల ఫారం వద్దకు వెళ్లగానే అమరావతి నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. ఈ సంఘటనలో నాగలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె ఇద్దరు కుమారులు ఆశీష్‌(9), సుశాంత(4)లకు తీవ్రగాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఆశీష్‌, సుశాంత పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాడికొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *