Tuesday, 3 November 2026

పెట్టుబడులకు భారతే అనుకూలం

C
– ప్రతి పౌరునికి స్వేచ్ఛ ఉంది

– అసహనానికి అంగీకరించం

– బ్రిటన్‌లో ప్రధాని మోదీ

15- భారత శాశ్వత సభ్యత్వానికి మా మద్ధతు:కామెరూన్‌

భారత్‌ సరికొత్త ఆశాకిరణం: మోదీ

లండన్‌, నవంబర్‌ 12 (జనంసాక్షి) :  ప్రపంచంలో పెట్టుబడులకు భారత్‌తే అన్ని విధాలుగా అనుకూలమని బ్రిటన్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.ఆర్థిక మందగమనం నుంచి బ్రిటన్‌ పునరుత్థానం చెందిన తీరు ఆసక్తికరమని, అదేసమయంలో ప్రస్తుతం ప్రపంచానికి భారత్‌ సరికొత్త ఆశాకిరణమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఉమ్మడిగా గళమెత్తాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు.  భారత సమాఖ్య విధానాన్ని ఇప్పుడో కొత్త అర్థం చెబుతున్నామని, భారత సమాఖ్య అంటే టీమిండియా అన్నది మా దృక్పథమని పేర్కొన్నారు. మారుతున్న భారతాన్ని చూడాలంటే విూరు భారత్‌ను సందర్శించాలని చెప్పారు. భారత్‌-బ్రిటన్‌ ఆర్థిక బంధం కొత్త పుంతలు తొక్కుతున్నదన్నారు. భారత్‌లో కొత్త రంగాల్లో పెట్టుబడులకు తలుపులు తెరిచామని చెప్పారు. అణుశక్తి, పునరుత్పాదక వనరుల విషయంలో బ్రిటన్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు.  పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఉమ్మడి బాధ్యతతో ముందుకు సాగాల్సిన అవసరముందని చెప్పారు. కలల భారత సాకారం ఇప్పుడు మనముందు నిలిచి ఉందని, భారత్‌ ప్రగతితో ప్రపంచంలో ఆరోవంతు మానవాళి తలరాత మారుతుందని పేర్కొన్నారు.ఐరాసలో ఉగ్రవాదంపై ఒకే నిర్వచనం ఉండేలా అందరూ మద్దతు పలుకాలని  బ్రిటన్‌ పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ కోరారు.  భారత ప్రధానమంత్రి బ్రిటన్‌ పార్లమెంటులో ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

భద్రతా మండలిలో భారత్‌కు పూర్తి మద్దతు: కామెరూన్‌

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి బ్రిటన్‌ సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ఆ దేశ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ స్పష్టం చేశారు. మూడు రోజుల బ్రిటన్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆ దేశ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంపై అగ్రనేతలిద్దరూ చర్చించారు. మేక్‌ ఇన్‌ ఇండియాకు బ్రిటన్‌ సహకరిస్తుందని కామెరూన్‌ అన్నారు. రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నిధులను అందిస్తామని తెలిపారు. ఇండోర్‌, పుణె నగరాలలో ప్రత్యేక అభివృద్ధి కేంద్రాలకు బ్రిటన్‌ సహాయం ఉంటుందన్నారు. స్మార్ట్‌ సిటీస్‌, స్వచ్ఛ్‌భారత్‌లలో బ్రిటన్‌ భాగస్వామ్యం పంచు

కుంటుందని, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటీష్‌ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఆ దేశ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ వివరించారు.

లండన్‌లో మోదీకి సైనిక వందనం

బ్రిటన్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లండన్‌లో ఘనస్వాగతం లభించింది. లండన్‌లోని కింగ్స్‌ చార్లెస్‌ స్ట్రీట్‌లో మోదీకి సైనిక వందనంతో బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ సాదరంగా స్వాగతం పలికారు. బ్రిటన్‌-భారత్‌ ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంపొందించుకునే ఉద్దేశంతో మోదీ లండన్‌లో అడుగుపెట్టారు. సైనిక వందనం అనంతరం ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం మోదీ, కామెరూన్‌ ఉమ్మడి విలేకరుల సమావేశం నిర్వహించారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బ్రిటన్‌ పర్యటనకు వచ్చారు. దాదాపు దశాబ్దం తర్వాత భారత ప్రధాని తొలిసారి బ్రిటన్‌ రావడంతో ఈ పర్యటనపై అంచనాలు ఏర్పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *