పెట్రోల్, డీజిల్ ధరల స్వల్ప సవరణ

3

పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా సవరిస్తూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ ధర లీటరుకు 32 పైసలు తగ్గించాయి. ఐతే, డీజిల్ ధరను లీటరుకు 28 పైసలు పెంచాయి. సవరించిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన, తగ్గిన ధరలు రాష్ట్రాల్లో పన్నులను బట్టి స్వల్పంగా మారతాయి.