పెనుమంట్ర గ్రామదర్శినిలో పాల్గొన్న పితాని
ఏలూరు,ఆగస్ట్21(జనం సాక్షి): పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరులో మంత్రి పితాని సత్యనారాయణ మంగళవారం గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో పలు చోట్ల డ్రైనేజి వ్యవస్థ బాగోలేదని, తక్షణమే డ్రైనేజి వ్యవస్థను బాగుచేయాలని సంబంధిత అధికారులకు మంత్రి పితాని ఆదేశించారు. అనేక సమస్యలపై గ్రామ ప్రజలతో చర్చించారు. సమస్యలను పరిస్కరించేందుకు నిధులు మంజూరు చేస్తామని అన్నారు.