గుంటూరు, జనంసాక్షి: గుంటూరు పోలీస్ పెరెడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. డ్యూటీ మీట్ సందర్భంగా జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ మంగళవారం ఉదయం జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. విషయాన్ని ఆలస్యంగా గమనించి అధికారులు అనంతరం జెండాను సరిచేసి మళ్లీ ఎగురవేశారు.




