గుంటూరు : వేమూరు మండలం అబ్బెనగూడపల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని రెండిళ్లతోపాటు 10 ఎకరాల గడ్డివాము దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపకసిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో తన మనవరాలి పెళ్లి కోసం దాచిన రూ 2.20లక్షల నగదు కాలి బూడిదైందని బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు.




