– కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్
హైదరాబాద్,అక్టోబర్13(జనంసాక్షి):
రాష్ట్రంలో గృహ నిర్మాణం పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఉండాలని సిఎం కెసిఆర్ అన్నారు. అలాగే ఇందులో ఎలాంటి అవినీతికి తావు లేకుండా చూసుకోవాలని కలెక్టర్లను ఆదేవించారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పది జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రశేఖర్‌రావు సవిూక్ష జరిపారు. మొత్తం 12 అంశాలు ఎజెండాగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, ప్రాజెక్టుల భూసేకరణ, జలహారం, హరితహారం, భూముల వేలం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై అధికారులతో కేసీఆర్ సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. సీఎం చెప్పిన అంశాలు ఆధారంగా ఈ కార్యక్రమంలో కలెక్టర్లు కీలకంగా పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూడటంలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు టీమ్ స్పిరిట్‌తో పనిచేయాలన్నారు. ఈ యేడాది రాష్ట్రవ్యాప్తంగా 60 వేల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సంకల్పించామని, నియోజకవర్గంలో 50 శాతం ఎమ్మెల్యేలు, 50 శాతం మంత్రి మంజూరు చేస్తారన్నారు. మండల కేంద్రాలు, పట్టణాల పరిధిలో 5 కిలోవిూటర్ల దూరంలో ప్రభుత్వ భూమిని ఉపయోగించవద్దన్న నిబంధనను సవరిస్తామన్నారు. గతంలో గృహ నిర్మాణం అనగానే ఊరికి దూరంగా డబ్బాలాంటి ఇండ్లను కట్టించారు. అందులో ఇప్పుడు ఎవరూ ఉండటంలేదు. గృహ నిర్మాణం పథకం కింద ఈసారి పైలట్ ప్రాజెక్టుగా నియోజకవర్గంలో 4 వందల ఇళ్లను కట్టిస్తాం. వచ్చే సంవత్సరం నుంచి ఈ సంఖ్యను పెంచుకుంటూ పోతామని ఇంటి పథకంపై వివరించారు. గృహ నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పిస్తామని, అయితే గృహ నిర్మాణంలో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా క్షమించేదిలేదని ఖరాఖండిగా చెప్పారు. లబ్దిదారుల ఎంపికలో తహసీల్దార్లు ఇచ్చే ధృవపత్రాలు తప్పనిసరి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. పేదల కోసం చేపట్టే ఈ ఇళ్ల నిర్మాణంలో అవినీతికి అవకాశం లేకుండా చూడాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా శిక్షిస్తామని హెచ్చరించారు. లబ్దిదారుల ఎంపికలో తహసీల్దార్లు ఇచ్చే ధ్రువపత్రాలు కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై కలెక్టర్లు చొరవ చూపాలని ముఖ్యమంత్రి సూచించారు. నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రజలు ఆశగా ఉన్నారని… వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.





