– బాబువి చెక్కిలిగింతలు
– నారా భువనేశ్వరి కారు గుర్తుకే ఓటేస్తున్నారు
– విజ్ఞతతో ఓటు వేయండి
– సీఎం కేసీఆర్ పిలుపు
హైదరాబాద్,జనవరి30(జనంసాక్షి): కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ది చేసుకుంటున్న క్రమంలో హైదరాబాద్ సమగ్రాభివృద్ది కేవలం టిఆర్‌ఎస్‌తో మాత్రమే సాధ్యమని టిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. గ్రేటర్ పీఠంపై టిఆర్‌ఎస్ ఉంటే తప్ప అభివృద్ది సాధ్యం కాదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ నగరానికి జరుగుతున్న ఎన్నికలు చాలా ముఖ్యమైనవని.. అందువల్ల రాజకీయ పార్టీల ప్రచార ¬రులో కొట్టుకుపోకుండా ప్రజలు విజ్ఞతతో ఓటేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో టిఆర్‌ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దీనిని విశ్వనగరంగా చేసే వరకు విశ్రమించనని అన్నారు. డల్లాస్ కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాలన్నదే తన ఆకాంక్షని అన్నారు. గ్రేటర్‌లో లంచం లేకుండా పర్మిషన్లు దక్కాలన్నదే తన ఆకాంక్షని అన్నారు. దీనిని అభివృద్ది చేసే క్రమంలో కెటిఆర్‌కు మున్సిపల్ శాఖను అప్పగించబోతున్నానని అన్నారు. 15 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. పోరాటాలు, ఉద్యమాలు, బలిదానాల సమాహారంగా రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. హైదరాబాద్‌ను ఆగం చేసిన వారు, దీనిని కేంద్రపాలిత ప్రాంతం కావాలని కొట్లాడిన వారు ఇవాళ మళ్లీ ఇక్కడ ఓటేయాలని వస్తున్నారని హెచ్చరించారు. తామే అంతా చేశామని అంటున్నవారు హైదరాబాద్‌లో పాలన చేసి చేసిందేమిటన్నారు. 2004లో తెలంగాణ అంశాన్ని దిల్లీకి తీసుకెళ్లానని, ఆనాడు తాను చేసిన ఒత్తిడి వల్ల యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చిందని చెప్పారు. హైదరాబాద్ విషయంలో తాను రాజీపడి ఉంటే 2007లోనే తెలంగాణ వచ్చేదన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కోసమే ఇంతకాలం పట్టిందన్నారు. హైదరాబాద్‌లేని తెలంగాణ తలలేని మొండెంలాంటిది గనక ఆనాడే తిరస్కరించానన్నారు. హైదరాబాద్ కోసం కుట్రలు చేసిన టిడిపి తదితర పార్టీలు ఇప్పుడు మళ్లీ ఓటు కోసం వస్తున్నారని హెచ్చరించారు. అందుకే హైదరాబాద్ అభివృద్దికి కంకణం కట్టుకున్నామని అన్నారు. ఇన్నాళ్లూ 60 ఏళ్లుగా పాలించిన వారు హైదరాబాద్‌ను ఎంతగా అస్తవ్యస్థం చేసిందీ విూకందనరికి తెలుసన్నారు. అందుకే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నగర ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని సీఎం అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో జరుగుతోన్న ముఖ్యమైన ఎన్నికలని తెలిపారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఇవాళ తెలంగాణ వచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రకటన వెలువడగానే ఆంధ్రా నాయకులు అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని తాము ఖరాఖండిగా చెప్పామన్నారు. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ వంటిదని వ్యాఖ్యానించారు. తాను ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించానని తెలిపారు. హైదరాబాద్‌ను నాశనం చేసింది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలని తెలిపారు. హైదరాబాద్ కోసం చంద్‌ంరబాబు ఎన్ని కుట్రలు చేసిందీ తెలియదా అని అన్నారు. మనమంతా గట్టి పోరాటం చేసి తెలంగాణను తెచ్చకున్నామని అన్నారు. అభివృద్ది, సంక్షేమాన్ని, హైదరాబాద్ పురోగతని దృష్టిలో పెట్టుకుని నగర ప్రజలు అధికార టిఆర్‌ఎస్ పార్టీని గ్రేటర్ ఎన్నికల్లో గెలిపించాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. హైదారబాద్ అభివృద్దికి తాము మాత్రమే కంకణబద్దులుగా ఉన్నామని అన్నారు. తెలంగాణ వస్తే చీకట్లు తప్పవన్న నాటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి భయపెట్టారని, ఇవాళ పరేడ్ గ్రౌండ్ జిగేల్‌మని వెలుగుతోందన్నారు. నిరంతర విద్యుత్ ఇస్తున్నామని అన్నారు. తెలంగాణ కరెంట్ కోతలు లేకుండా ఉందన్నారు. అంతేగాకుండా వివిధ సంక్షేమ కార్యాక్రమానలు ప్రత్యేక తెలంగాణ వల్లనే అమలు చేసుకోగులగుతున్నామని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లో 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఇందిరాపార్క్ వద్ద పారిశ్రామిక వేత్తలు విద్యుత్ కోసం ధర్నాలు చేసేవారని అన్నారు. నగరంలో పరిశుద్ధమైన తాగునీరు కూడా సరఫరా చేసే పరిస్థితి లేకపోవడం గత పాలకులు చేసిన పాపం ఫలితమేనని అన్నారు. మూసీ నది, హుస్సేన్‌సాగర్‌ను కాలుష్య కారకంగా మార్చింది ఎవరో ప్రజలే తెలుసుకోవాలని అన్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది.. ప్రజలు హాయిగా జీవిస్తున్నారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు ఇక్కడ మళ్లీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం విడిపోతే హైదరాబాద్‌లో ఏదో జరుగుతదని కొందరు విష ప్రచారం చేశారు. అలాంటిదేమి జరగలేదు. 18 నెలల కాలంలో ఎవరిపైనా అయినా దాడి జరిగిందా? శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ప్రకటనలు చేసి ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక నగరంలోని పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రాజధానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. జంట నగరాలకు సరైన మంచినీటి రిజర్వాయర్ లేకపోవడం దారుణమైన విషయమన్నారు. ఇవాళ నగర నీటి అవసరాల కోసం 40 టీఎంసీల సామర్థ్యంతో నూతన రిజర్వాయర్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, వృద్ధులు, వితంతువులకు రూ.వెయ్యి పింఛన్, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పంపిణీ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతులకు రుణమాఫీ, మైనార్టీల కోసం బడ్జెట్‌లో రూ.1100 కోట్లు కేటాయింపు, అంగన్‌వాడీలకు జీతాలు పెంపు, బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారం, 10 లక్షల మంది డ్రైవర్లకు బీమా సదుపాయం, భవన నిర్మాణ కార్మికులకు రూ.5లక్షల బీమా సదుపాయం తదితర సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
చంద్రబాబును టార్గెట్ చేసిన కెసిఆర్
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఏంపని అని ప్రశ్నించారు. ఆయనకు రోడ్లు ఊడ్చుకోవాలంటే హిందూపురం నుంచి ఇచ్చాపురం దాకా చాలా బజార్లు ఉన్నాయి కదా అని నిలదీశారు. అక్కడ ఆయనకు ఏపీ ప్రజలు కావాల్సినంత పని ఇచ్చారని అన్నారు. మా హైదరాబాద్ రోడ్లను మేమే ఊడ్చుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌ను వదలను బొమ్మాళి అని చంద్రబాబు అంటున్నారని ఎద్దేవా చేశారు. అక్కడ విజయవాడకు వెళ్లి నాకు హైదరాబాద్ నుంచి పాలన చేయాలంటే విదేశాల నుంచి పాలన చేస్తున్న భావన కలుగుతుందని అంటూ అక్కడి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి వదిన కూడా మనకే ఓటేస్తారని అన్నారు. చంద్రబాబును హైదరాబాద్‌ను విడిచి వెళ్లాలని ఎవరూ అనడంలేదని తెలిపారు. కావాలంటే
చంద్రబాబు ఇంక నాలుగు హెరిటేజ్‌లు పెట్టుకుంటామన్నా అనుమతి ఇస్తామన్నారు. పదిహేను రోజులకోసారి వచ్చి వ్యవహారాలు చూసుకుని వెళ్లొచ్చని సూచించారు. తాను అమరావతి వెళ్లి అక్కడే ఉంటానంటే కలుస్తదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు రావొచ్చు పోవచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చని తెలిపారు. చంద్రబాబు వల్ల హైదరాబాద్‌కు ఏవిూ జరుగదన్నారు. చంద్రబాబు చేతిలో కత్తుందా? నెత్తుందా? అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోనే ఉంటానని చంద్రబాబు అంటున్నారని మండిపడ్డారు. ఆయనను ఉండొద్దని ఎవరూ అనడంలేదన్నారు. ఆయన హెరిటేజ్ వ్యాపారాలను చూసుకోవడానికి ఇక్కడ ఆయన భార్య భువనేశ్వరి దేవీ ఉన్నారని తెలిపారు. ఆమె బ్రహ్మాండంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ‘మా వదినే భువనేశ్వరి నిజాయితిపరురాలు. ఆమె కూడా మా టీఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేస్తానని మా కార్యకర్తలకు తెలిపారు’ అని వివరించారు. తప్పకుండా తమకే వేస్తారని అన్నారు. ఆయన ఇక్కడ అధికారంలో లేరని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే నగరాభివృద్ధి సాధ్యమన్నారు. అందుకే నగర ప్రజలు చంద్రబాబు మాటలను విశ్వసించొద్దని కోరారు. నగరంపై తనప ముద్ర ఉందన్నచంద్రబాబు మాటలపై కెసిఆర్ విమర్వలు గుప్పించారు. బషీర్‌బాగ్‌లో విద్యుత్ పోరాటాలపై కాల్పుల ముద్ర, అసెంబ్లీకి వచ్చిన అంగన్‌వాడీలపై గుర్రాలతో తొక్కించిన ముద్ర, మూసీ మురికి కంపు, ఇలా చెప్పుకుంటే అనేక రకాలుగా ముద్ర ఉందన్నారు. వర్షం వస్తే రోడ్లన్నీ జలమయం కాక తప్పదన్నారు.
ఇలా మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఇన్నేళ్లు పాలించిన వారు నగరంలో కనీస మూత్ర శాలలు కట్టేలదన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కడుతున్నారని చంద్రబాబు నాయుడుతో నగరంలో తిరుగుతూ కేంద్ర మంత్రి దత్తాత్రేయ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు దేశంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందే తెలంగాణ రాష్ట్రంలో అని తెలిపారు. ఈ పథకం తాను ఎన్నికల మేనిఫెస్టోల పెట్టి ప్రచారం చేశానని అన్నారు. ఈ పథకం ఒక్క తెలంగాణలో ఉందా అన్నది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలన్నారు. వాళ్ల బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ పథకం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబుతో తిరిగి ప్రచారం చేశావు కదా ఆంధ్రాలో ఈ పథకం ఉందా అని నిలదీశారు. ఇలాంటి అబద్దాలు ఎందుకు చెప్పారని అన్నారు. దత్తాత్రేయ పెద్ద మనిషి అనుకుంటే ఆయన కూడా అబద్దాలు చెబుతున్నారని అన్నారు.
వరంగల్ ముఠానే పట్నంలో తేలింది
సిపిఐ నారాయణ టిఆర్‌ఎస్ గెలిస్తే చెవి కోసుకుంటానని చేసిన ప్రకటనపై మండిపడ్డారు. ఎవరు చెవి కోసుకుంటారో 2నాడు ప్రజలు తేలుస్తారని అన్నారు. వరంగల్‌లో దెబ్బతిన్న వారే ఇప్పుడు పట్నంలో తేలారని, ఎవరు చెవి కోసుకుంటారో తేలుతుందని అన్నారు. అక్కడ అందరికి డిపాజిట్లు గల్లంతయ్యాయని అన్నారు. ఎవరు తొడకోసుకుంటారో, మెడ కోసుకుంటారో తేలుతుందన్నారు.





