Tuesday, 3 November 2026

పోలవరంకు ముహూర్తం

chandrababu-naidu-pti_647_080216012602పోలవరం కాంక్రీట్‌ పనులకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 19న అట్టహాసంగా కాంక్రీట్‌ పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణాన్ని జనవరి మొదటివారంలోనూ, ఫ్యాబ్రికేటెడ్‌ డ్యామ్‌ గేట్ల తయారీని సంక్రాంతి నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 19న చేపట్టే కాంక్రీట్‌ పనుల కార్యక్రమానికి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతిసహా కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్య నాయుడు, అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. అందరి సమక్షంలో పండుగ వాతావరణంలో కాంక్రీట్‌ పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *