హైదరాబాద్, మార్చి 18: రాష్ట్ర విభజన తర్వాత సాగునీటి సమస్యలు ఏర్పడ్డాయని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు 10, 415 కోట్ల రూపాయలు కావాలని ఆయన పేర్కొన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టును తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని ఆయన అన్నారు. నీటి సమస్య సున్నితమైనదని ఆయన అన్నారు. నీటి కోసం గ్రామాలు, రాష్ట్రాలు, దేశాల మధ్య గొడవలు జరిగేపరిస్థితులున్నాయన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రజలకు జవాబుదారీ అని, అందుకే పట్టిసీమపై ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు.




