పోలీసులమని చెప్పి తుపాకీతో బెదిరించి చోరీ
విశాఖ, ఆగస్టు 24 : కసింకోట మండలం కన్నూరుపాలెం వేబ్రిడ్జి సిబ్బందిని పోలీసులమని చెప్పి తుపాకీతో బెదిరించిన దుండగులు కౌంటర్లోని రూ.3 లక్షలు, 1.5 తులాల బంగారు గొలుసు, రూ.5 లక్షల చెక్కును అపహరించారు. దీనిపై అనకాపల్లి పోలీసులకు వేబ్రిడ్జి సిబ్బంది ఫిర్యాదు చేశారు