పోలీస్ కాల్పుల్లో సైకో మృతి

15k4jwmfకరీంనగర్ లక్ష్మీనగర్ లో సైకో హల్ చల్ చేశాడు. తల్లిదండ్రులు, స్థానికులపై బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిండు. ఈ దాడిలో సుమారు 20 మంది గాయపడ్డారు. సైకోను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా కత్తితో దాడి చేసిండు. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. సైకో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బల్వీందర్ సింగ్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.