Tuesday, 3 November 2026

పౌరసన్మానానికి వెంకయ్య ఫిదా

బాబుకు లేఖ

అమరావతి,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): ఉపరాష్ట్రపతిగా తనకు అమరావతిలో అపూర్వమైన పౌరస్కరాం జరపడంపై వెంకయ్య నాయుడు ఫిదా అయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య లేఖ రాశారు. అపూర్వరీతిలో చేసిన పౌరసన్మానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని వెంకయ్య లేఖలో పేర్కొన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి వేలాదిమంది విద్యార్థులు జాతీయ జెండాలతో స్వాగతం పలికిన తీరు అద్భుతమని వెంకయ్య తెలిపారు. కేంద్రమంత్రిగా చివరి సంతకం పెట్టి ఏపీకి మంజూరు చేసిన 2.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి పైలాన్‌ ఆవిష్కరణ సంతోషమన్నారు. తెలుగు నేలను, తెలుగు ప్రజలను ఎప్పటికీ మరిచిపోనని వెంకయ్య ఈ సందర్భంగా తెలిపారు. రాష్టాభ్రివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని లేఖలో వెంకయ్య పేర్కొన్నారు.