
ప్రాజెక్టుల ప్రతిపాదనలపై రైల్వే జీఎంతో టీ ఎంపీల భేటీ
నిధుల కోసం ఒత్తిడి తెస్తాం – దత్తాత్రేయ
హైదరాబాద్,జనవరి7(జనంసాక్షి): రైల్వే బడ్జెట్లో రాష్టాన్రికి నిధులపై ఎంపీలందరం పోరాడతామనీ తెలంగాణ ఎంపీలు అన్నారు. ప్రాజెక్టుల ప్రతిపాదనలపై రైల్వే జీఎంతో బుధవారం సమావేశం అయ్యారు. నిధుల విషయాన్ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ దృష్టికి తీసుకువచ్చారు. దానిపై మంత్రి స్పందిస్తూ నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని దత్తాత్రేయ పేర్కొన్నారు. రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవతో భేటీ ముగిసిన అనంతరం దత్తాత్రేయ విూడియాతో మాట్లాడారు. రైల్వే శాఖ మంత్రితో ఉన్నతాధికారులు, ఎంపీల భేటీకి కృషి చేస్తానని ప్రకటించారు. రైల్వే బడ్జెట్లో రాష్టాన్రికి అధిన నిధులు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. మౌలాలిలో రైల్వే టెర్మినల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతానని వెల్లడించారు. వివిధ పనులకు సంబంధించి ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. ఇందులో కాజీపేట రైల్వే జోన్ ఏర్పాటు తదితర అంశాలు ఉన్నాయన్నారు. రైల్వే లైన్ల అభివృద్ధి కోసం జీఎంను ఒక రోజు పర్యటనకు ఆహ్వానించామని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవతో టీఎంపీలు భేటీ అయిన అనంతరరం ఆయన విూడియాతో మాట్లాడుతూ రామగుండం, మణుగూరు, రైల్వే లైన్‌ను త్వరగా పూర్తి చేయాలని కోరినట్టు తెలిపారు. అలాగే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని కోరామని వెల్లడించారు. కొత్త రైళ్లను ప్రతిపాదించటంతోపాటు కొన్ని రైళ్లకు హాల్ట్ సదుపాయాన్ని కల్పించాలని జీఎంను కోరామని స్పష్టం చేశారు. సిర్పూర్-హైదరాబాద్‌కు మెమో రైల్ వేయాలని కోరడంతోపాటు ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును మార్చాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. రైల్వే ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశాలు కల్పించాలని ఈ సమావేశంలో జీఎంను కోరామని పేర్కొన్నారు. ఇక యాదగిరి గుట్ట సవిూపంలో ఉన్న రాయగిరి స్టేషన్ పేరును యాదగిరిగా మార్చి దీనిని మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని కోరామని భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. కాజీపేటకు రైల్వే జోన్ కావాల్సి ఉందన్నారు. వివిధ మార్గాల అభివృద్దికి ప్రణాళిక అవసరమని, నిధుల కోసం ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. ఎంపి వివేక్ కూడా ఈ భేటీలో ఉన్నారు. సికింద్రాబాద్‌లోని రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవతో ఎంపీల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. రైల్వే బడ్జెట్లో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని జీఎంకు ఎంపీలు విన్నవించారు. రైల్వే బడ్జెట్లో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం రైల్వే జీఎం శ్రీవాత్సవ విూడియాతో మాట్లాడారు. రాష్టాన్రికి రైల్వే బడ్జెట్లో అధిక నిధులు ఇవ్వాలని ఎంపీలు కోరారని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఎంపీలు విన్నవించారని పేర్కొన్నారు. ఎంపీల ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపుతామని చెప్పారు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2ను 2017 మార్చిలోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు. హైదరాబాద్ – న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని ఎంపీలు కోరారని చెప్పారు. త్వరలో హైదరాబాద్ – న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తామని స్పష్టం చేశారు




