Tuesday, 3 November 2026

ప్రకాశం బ్యారేజీ కుడికాల్వకు నీరు విడుదల

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ కుడి కాలువకు జలవనరుల శాఖ అధికారులు సోమవారం ఉదయం నీరు విడుదల చేశారు. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి కృష్ణా, గోదావరి జలాలు చేరుతుండటంతో కృత్తివెన్ను, కలిదిండి, కైకలూరు ప్రాంతాలకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నీరు విడుదల కావడంతో కుడి ప్రధాన కాల్వగట్టుతో పోలవరం కుడి కాల్వగట్టు, సమీప ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *