ప్రజలకు ఆరోగ్య అవగాహనా కార్యక్రమం
శ్రీకాకుళం,ఆగస్ట్25(జనం సాక్షి): కవిటి మండల కేంద్రంలోని ఆసుపత్రి ఆవరణలో స్థానికులకు ఆరోగ్యంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె.ధనంజయ రెడ్డి, ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రారంభించారు. ఉద్దానం ఏడు మండలాల్లో నిర్వహించనున్న అవగాహన సదస్సుల్లో సామాజిక అంశాలు, జీవనశైలిలో మార్పులు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.కార్యక్రమంలో జిల్లా గ్రావిూణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ జి సి కిషోర్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. తిరుపతి రావు, సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి ఎస్. త్రినాథరావు, ఎస్. డి. సి అనిత, వైద్య శాఖ అధికారులు మెండ ప్రవీణ్, బి. జగన్నాథ రావు, బి. సూర్యా రావు తదితరులు పాల్గొన్నారు.
—————–