Thursday, 5 November 2026

ప్రజలకు మంచినీరిస్తాం

C

– ప్రతిపక్షాలకు మూడు చెరువు నీళ్లు

– మంత్రి కేటీఆర్‌

నల్లగొండఅక్టోబర్‌17(జనంసాక్షి):

ఇంటింటికి తాగునీరు ఇచ్చేందుకు దేశంలోనే ఎక్కడాలేని విధంగా వాటర్‌ గ్రిడ్‌ పథకం ప్రారంభిస్తున్నామని ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ చెప్పారు. వాటర్‌ గ్రిడ్‌ పథకంతో ప్రజలు మంచినీళ్లు తాగితే.. ప్రతిపక్షాలు మూడు చెరువుల నీళ్లు తాగడం ఖాయమన్నారు. నల్లగొండ జిల్లా పానగల్‌ లోని ఉదయ సముద్రం ప్రాజెక్టు దగ్గర వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు మంత్రులు కేటీఆర్‌, లక్ష్మారెడ్డి, జగదీశ్‌ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడారు. వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ప్రశంసించారని ఆయన చెప్పారు. వాటర్‌ గ్రిడ్‌ పథకం ఎక్కడో ఉన్న యూపీ సీఎంకు అర్ధమైంది కానీ.. పక్కనే ఉండే జానారెడ్డికి అర్థంకాలేదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.వాటర్‌ గ్రిడ్‌ కు అన్ని వేల కోట్లు అవసరమా అని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌ నాయకులకు మంత్రి కేటీఆర్‌ దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. సమైక్య రాష్ట్రం చివరి బడ్జెట్‌ లో చిత్తూరు జిల్లా తాగునీటి ప్రాజెక్టుకు ఆ జిల్లాకు చెందిన అప్పటి ముఖ్యమంత్రి ఏడు వేల కోట్లు రూపాయలు మంజూరు చేస్తే మంత్రివర్గంలో సంతకం చేసింది విూరు కాదా అని ప్రశ్నించారు. అప్పుడు భట్టి విక్రమార్క, జానారెడ్డి, ఉత్తమ్‌ ఏం చేశారని నిలదీశారు. ఒక్క జిల్లాకే ఏడు వేల కోట్లు ఖర్చయితే.. తెలంగాణ పది జిల్లాలకు ఆ మాత్రం ఖర్చు కాదా అని నిలదీశారు. తలాపునే కృష్ణా నది పారుతున్నా రెండు లక్షల మందికి పైగా నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ తో బాధపడుతుంటే మంచినీళ్లు ఇవ్వమని అడిగే సోయి లేని విూరా ప్రశ్నించేది అని కడిగిపారేశారు. వాటగ్‌ గ్రిడ్‌ ఖర్చుపై ఏ వేదిక విూదనైనా చర్చకు సిద్ధమని మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.కట్టని ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులెత్తిన కాంగ్రెస్‌ నేతల నాయకుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అని కేటీఆర్‌ విమర్శించారు. ఎన్నికలప్పుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కారులో దొరికిన రూ. 3కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతిలో మునిగితేలిన నాయకులకు మంచి పనులు కూడా అలాగే కనిపిస్తాయన్నారు.

రైతులకు కాంగ్రెస్‌ పై నమ్మకం లేదని, రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామన్నా కాంగ్రెస్‌ ను ప్రజలు నమ్మలేదని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల రుణాలను ఒకేసారి రూ.17వేల కోట్లు మాఫీ చేసిందని చెప్పారు. పోలీస్‌స్టేషన్లలో విత్తనాలు సరఫరా చేసిన ఘనత గత ప్రభుత్వాలదని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక రైతులకు సరిపడా విత్తనాలు అందిస్తున్నామని తెలిపారు. 5,500 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టును నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే ఎండాకాలం నుంచి రైతులకు పగటి పూట 9 గంటల కరెంట్‌ ఇస్తామన్నారు.దేశంలో ఎక్కడాలేని విధంగా అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ వివరించారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను తీసుకొచ్చినమని చెప్పారు. ముఖ్యమంత్రి మనవడు తినే సన్నబియ్యంతోనే సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అన్నం పెడుతున్నామని తెలిపారు.పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. పెన్షన్ల కోసం ఏటా రూ. 4,400 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గతంలో ఒక్కొక్కరికి నాలుగు కిలోల చొప్పున, కుటుంబానికి 20 కిలోల బియ్యం సీలింగ్‌ పెడితే.. తాము సీలింగ్‌ లేకుండా మనిషికి 6 కిలోల చొప్పున రేషన్‌ బియ్యం ఇస్తున్నామని కేటీఆర్‌ వివరించారు. ప్రతిపక్ష నేతలు ప్రజల నైతిక ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.వాటర్‌ గ్రిడ్‌ కు రూపకల్పన చేసిన తర్వాత పైలాన్‌ ఎక్కడ ఏర్పాటు చేయాలని ఆలోచించినప్పుడు సీఎం కేసీఆర్‌ నల్లగొండలో నిర్మించాలని చెప్పిన విషయం మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ తో బాధపడుతున్న ప్రజల పరిస్థితి చూసి ముఖ్యమంత్రి చలించిపోయారని, వాళ్లను చూసిన తర్వాతనే తనకు వాటర్‌ గ్రిడ్‌ ఆలోచన వచ్చిందని కేసీఆర్‌ చెప్పారని మంత్రి తెలిపారు. ఏడాదిన్నర లోపు నల్లగొండ జిల్లాకు వాటర్‌ గ్రిడ్‌ ద్వారా మంచినీటి సరఫరా చేస్తామని ఆయన ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *