ప్రజలు అభివృద్దికి పట్టంకట్టారు

కాకినాడ ప్రజలకు ధన్యవాదాలు: చంద్రబాబు

అమరావతి,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కాకినాడ ప్రజలు తనపై విశ్వాసం ఉంచి విజయం అందించినందుకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.తనపై, ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొన్నారు. శుక్రవారంఆయన విూడియాతో మాట్లాడుతూ టీడీపీ పని అయిపోయిందని ప్రచారం చేశారన్నారు. ప్రాంతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని.. రాష్టాభ్రివృద్ధిని అడ్డుకోవాలని కొందరు యత్నించారని చంద్రబాబు ఆరోపించారు. కానీ రాష్టాన్న్రి సంక్షోభం నుంచి గట్టెక్కించే సత్తా టీడీపీకే ఉందని.. అందుకే మున్సిపల్‌, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే ప్రజలు టీడీపీకి ఓటు వేశారన్నారు. ప్రభుత్వంతో పాటు, తనపై కాకినాడ ప్రజలు అచంచల విశ్వాసం చూపించారని చెప్పుకొచ్చారు. మొన్న నంద్యాల, ఇవాళ కాకినాడ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. వరుస ఎన్నికలతో పాలన ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టిసీమను పూర్తి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్టాభ్రివృద్ధి కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నానన్నారు. మూడేళ్ల పాలనలో ప్రజలు

సంతృప్తిగా ఉన్నారన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టిసీమను పూర్తిచేశామని.. పట్టిసీమ ఫలితాలు ఇప్పుడు కనబడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. వర్షాభావం ఉన్నా వ్యవసాయాభివృద్ధి సాధించామని.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరాలని ఆశించారు. టెక్నాలజీని ఉపయోగించుకొని అవినీతిని అరికడతామన్నారు. బెల్ట్‌షాపులపై కఠినంగావ్యవహరిస్తున్నామని.. అవసరమైతే పీడీయాక్ట్‌లు పెట్టేందుకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు.

తాజావార్తలు